నగరి ఎమ్మెల్యే రోజా అంటే తెలియని వారుండరు. ఎందుకంటే రోజా… ఎమ్మెల్యేగానే కాకుండా సినీ పరిశ్రమ ద్వారా ఎంతో ఫేమస్. ప్రస్తుతం జబర్దస్త్ షోలో జడ్జిగా అందరినీ కనువిందు చేస్తోంది నగరి ఎమ్మెల్యే రోజా . ఆ షోలో ఆమె చేసే సందడి… నవ్వులు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎమ్మెల్యే రోజా శస్త్రచికిత్స చేయించుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. ఐసీయూ నుంచి ఇవాళ ఆమెను వార్డుకు తరలించారు డాక్టర్లు. అయితే.. ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం కోలుకుంటున్నారని రెండు వారాల పాటు విశ్రాంతిలో ఉండనున్నారని ఆమె భర్త సెల్వమణి తెలిపారు. ఫ్యాన్స్ ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని.. అలాగే ఆస్పత్రి వచ్చేందుకు ప్రయత్నాలు చేయవద్దని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఎమ్మెల్యే రోజా డిశ్చార్జ్ అవుతారని ఆమె వెల్లడించారు. అయితే.. తాజాగా రోజా చేయించుకున్న శస్త్రచికిత్స కారణంగా జబర్దస్త్, ప్రజా కార్యక్రమాలకు కొన్ని రోజులు దూరంగా ఉండే అవకాశం ఉంది.
previous post
next post


ఏపీలో మతమార్పిళ్లు తప్ప మరేం జరగడం లేదు: కన్నా