telugu navyamedia
క్రీడలు వార్తలు

రసెల్‌ ఫిట్‌నెస్‌ పై మైకేల్‌ వాన్ కీలక వ్యాఖ్యలు…

మైకేల్‌ వాన్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఆండ్రీ రసెల్‌ శారీరక సమస్యతో బాధపడుతున్నట్లు కనిపిస్తున్నాడన్నాడు. ఎంతో విలువైన ఆటగాడు జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్‌ ఆడకపోతే ఆ ప్రభావం టోర్నీ చివర్లో కనిపిస్తుందని వాన్ పేర్కొన్నాడు. ‘రసెల్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అతని ఫిట్‌నెస్‌ లెవెల్స్‌ చాలా కింది స్థాయిలో ఉన్నాయి. గతంలోలా చురుగ్గా మాత్రం లేడు. ఫీల్డింగ్‌ చేసేటప్పుడు వంగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. బాల్‌ అతని దగ్గరకు వచ్చినప్పుడు ఫీట్‌ను ఉపయోగిస్తున్నాడు’ అని వాన్ అన్నాడు. ’19 ఓవర్‌లో భారీ షాట్ల సంగతి పక్కన పెడితే.. ఆండ్రీ రసెల్ డబుల్స్‌ తీసే ప్రయత్నం కూడా చేయడం లేదు. రసెల్‌ వంటి సూపర్‌ స్టార్‌ ఇలా అన్‌ఫిట్‌గా ఉండటం ఆ జట్టుకు సరికొత్త తలనొప్పే. ఇలా అయితే కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌, కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌లకు జట్టును ముందుకు తీసుకెళ్లడం కష్టంగా మారడం ఖాయం’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2021 కోసం వాన్‌ వ్యాఖ్యాతగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

Related posts