telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్.. ఆ వెంటనే బెయిల్!

MLA Sridhar Reddy Hulchal

ఎంపీడీఓ సరళ పెట్టిన కేసులో ఈ తెల్లవారుజామున నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. , ఆపై స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి, ఆధారాలుంటే, తమ పార్టీ నాయకుడైనా కచ్చితంగా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారని, అటువంటి వ్యక్తి కలకాలం పాటు రాష్ట్రానికి సీఎంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అయినా విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.

ఈ కేసులో పూర్తి విచారణ జరిపించాలని పోలీసులను కోరుకుంటున్నానని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తన దురదృష్టం కూడా ఉందని, జిల్లా ఎస్పీకి, తనకు విభేదాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందేనని, డీజీపీ నుంచి ఆదేశాలు రాగానే ఆయన ఏ మాత్రమూ విచారించకుండా తనను అరెస్ట్ చేయించారని కోటంరెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు ముందు కూడా ఆయన తనను అదే విధంగా ఇబ్బంది పెట్టారని అన్నారు.

Related posts