నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని కోరుకుంటున్న.. జీవితాంతం ఉండాలని ఉంది.. నేను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా.. పార్టీలో ఉంటున్నాను అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తన పంచాయితీ రేవంత్‌తో మాత్రమేనని కాంగ్రెస్‌తో కాదని, రేవంత్‌రెడ్డి కి జగ్గారెడ్డి అంటే ఏంటో తెలియాలంటూ జగ్గారెడ్డి హాట్ కామెంట్లు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా.. పార్టీ బాధ్యతల నుంచి సోమవారం జగ్గారెడ్డిని హైకామాండ్ తప్పించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో తప్పొప్పులు మాట్లాడుకునే వీలుంటుందని, పదవుల కోతని స్పోర్టివ్‌గా తీసుకుంటున్నానని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ సోనియా, రాహుల్ నాయకత్వాన్ని సమర్థిస్తానన్నారు. దేశానికి కాంగ్రెస్ పార్టీతోనే మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
సోనియా గాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమని చెప్పారు. మైనస్‌లను ప్లస్ ఎలా చేసుకోవాలో తనకు తెలుసునని జగ్గారెడ్డి చెప్పారు. ఏ రోగానికి ఏ మందు పెట్టాలో తనకు తెలుసునని జగ్గారెడ్డి తెలిపారు.
తనతో తనతో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఎవరూ మాట్లాడట్లేదన్నారు. తనతో మాట్లాడేందుకు నేతలు భయపడుతున్నారని అన్నారు. తనకు ఢిల్లీ నుంచి పిలుపు రాలేదని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా అన్నందుకు నొచ్చుకుని ఉంటారని.. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని జగ్గారెడ్డి అన్నారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేశారు.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలుపుకొని పోయే పద్ధతి లేదా అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.
20 రోజుల క్రితం రేవంత్ ఫోన్ చేశారని, మెదక్ పర్యటనకు వెళ్తన్నట్లు చెప్పినట్లు తెలిపారు. కానీ దామోదర రాజనర్సింహతో మరో రకంగా చెప్పారని అన్నారు…అందుకే కోపం వచ్చిందని వెల్లడించారు.
రాజకీయంగా సీఎం కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కానీ కాంగ్రెస్‌లోని కొందరు సోషల్ మీడియా ద్వారా తన పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా పీసీసీ చీఫ్ పదవి ఆశించానని, అయితే రాహుల్‌తో పోట్లాడే స్థాయి తనది కాదని అందుకు మౌనంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీపై అభిమానంతోనే ఎప్పట్నుంచో ఇదే పార్టీలో ఉన్నానని వెల్లడించారు.
జగ్గారెడ్డి తీరుపై కాంగ్రెస్ లో అనుమానాలు!