telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి స్టూడియోలు: కేటీఆర్

ktr trs president

సినిమా రంగంలోని పోస్ట్ ప్రొడక్షన్ పనికి అంతర్జాతీయ స్థాయిని హైదరాబాద్ అందుకుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ స్థాయి స్టూడియోలు హైద్రాబాద్ నగరంలో ఉన్నాయని మంత్రి అన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా నాలుగు రోజుల ‘జాయ్ ఇండియా’ కార్యక్రమం మంత్రి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభమైంది.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… సినిమా రంగంలోని పోస్ట్ ప్రొడక్షన్ పనికి అంతర్జాతీయ స్థాయిని హైదరాబాద్ అందుకుందని చెప్పారు.

వీఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్ రంగంలో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోందని తెలిపారు. వీఎఫ్ఎక్స్ కు తలమానికంగా నిలిచే బాహుబలి, ఈగ, మగధీర వంటి చిత్రాలు హైదరాబాద్ లో రూపొందాయని గుర్తు చేశారు. జాయ్ ఇండియా’ కార్యక్రమంలో వీఎఫ్‌ఎక్స్, ఈ స్పోర్ట్స్ వంటి వినోద రంగాల్లో పలు అంశాలపై ఇందులో చర్చా కార్యక్రమాలు జరుగుతాయి. 50 దేశాల నుంచి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు.

Related posts