telugu navyamedia
వ్యాపార వార్తలు

వంటింట్లో గ్యాస్ మంట‌..: రూ. 50 పెరిగిన సిలిండర్ ధర

చమురు ధ‌ర‌ల పెర‌గ‌డంతో సామాన్య ప్ర‌జ‌ల‌కు షాక్ త‌గిలింది..ఇప్పటికే వంటింట్లో ఉప‌యోగించే నిత్యావసరాల ధరలు మోత మోగుతుంటే.. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

14 కేజీల ఎల్​పీజీ సిలిండర్‌ ధరను రూ.50 పెంచాయి.ఇక‌ పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి . పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు ఇవాళ్టి నుంచే అమ‌ల్లోకి రానున్నాయి. దీంతో వంటగ్యాస్ ధర వెయ్యి దాటింది.

తెలుగు రాష్ర్టాల్లో వెయ్యి దాటిన సిలిండర్ ధర

తెలంగాణలో 14 కేజీల వంట గ్యాస్‌ ధర తొలిసారి వెయ్యి దాటేసి రూ.1002కు చేరింది… తాజా పెంపుతో ఆంధ్రప్రదేశ్‌లో 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1008కి పెరిగింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగింపు, ఉక్రెయిన్‌లో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో చమురు సంస్థలు ధరలు పెంచినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related posts