కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఆ నష్టం నుంచి తిరిగి పుంజుకునేందుకు అన్ని మళ్లీ ముందుకు వచ్చాయి. అందులో క్రీడాలు కూడా ఉన్నాయి. అయితే అనేక జాగ్రత్తలు తీసుకుంటూ అన్నింటిని పునరుద్దరిస్తున్నారు. ఇదేవిదంగా ఇటీవల బీసీసీఐ కావలసిన అన్ని జాగ్రత్తలతో ఐపీఎల్-2020 నిర్వహించింది. దాని తరువాత అన్‌లాక్ కూడా మొదలైంది. దాంతో దాదాపు 268రోజుల తరువాత భారత జట్టు మరో దేశానికి టూర్‌కు వెళ్లింది. ఆస్ట్రేలియాతో మొత్తం మూడు ఫార్మాట్లలోనూ ఆడేందుకు వెళ్ళింది. అయితే ఇందులో భాగంగా జరిగిన వన్డే మ్యాచ్‌లలో భారత్ చివరి మ్యాచ్‌ను గెలిచి క్లీన్ స్వీప్ కాకుండా నిలబడింది. దాని తరువాత టీ20 మ్యాచ్‌లు మొదలయ్యాయి. అందులో భారత్ తన సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు ఏడు వికెట్లను కోల్పోయి 161పరుగులు చేసింది. అయితే తరువాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు వచ్చిన ఆసిస్‌ను నిర్ణీత ఓవర్లకు 150పరుగులు మాత్రమే ఇచ్చి భారత్ కట్టడి చేసింది. అయితే తరువాత జరగనున్న టీ20 మ్యాచ్‌ల నుంచి ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తప్పుకోనున్నాడు. దానికి తన కుటుంబ ఆరోగ్య పరిస్థితి గురించి వచ్చిన వార్తే కారణమని వార్తలు వస్తున్నాయి. అయితే మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తాడనే దానిపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. అయితే ప్రపంచంలో అన్నింటి కన్నా కుటుంబం ముఖ్యమనది, దాని తరువాతే ఏదైనా. మిచెల్‌కు కావలసినంత సమయాన్ని ఇస్తాం. తాను అనుకున్నప్పుడే జట్టులోకి రావచ్చు. తన కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటాం అని జట్టు సభ్యులు తెలిపారు. మరి రానున్న మ్యాచ్‌లో మిచెల్ స్థానాన్ని ఎవరు తీసుకోనున్నరో తెలియాలి.
previous post
next post

