telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఏడో రోజుకు చేరిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోన‌ళ‌లు..

*ఏడోరోజు కొన‌సాగుతున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు..
*12 డిమాండ్ల‌పై సానుకూలంగా స్పందించే యోచ‌న‌లో ప్ర‌భుత్వం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏడు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు.. 12 డిమాండ్ల పరిష్కారానికి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్ధులు తేల్చి చెబుతున్నారు. డిమాండ్లపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

గత ఆరేళ్లుగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఉన్న సమస్యలు పరిష్కరించలేదని స్టూడెంట్స్ అంటున్నారు. చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదని వాపోయారు. చివరికి క్యాంపస్ లో ఉన్న దాదాపు 9 వేల మంది విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. ఇప్పటికే ట్రిపుల్‌ఐటీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మ‌రోవైపు…విద్యార్ధుల డిమాండ్ సానుకూలంగా స్పందించే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Sabitha Indra Reddy Urges IIT Basara Students to Stop Agitation

ఈ క్ర‌మంలో ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సోమ‌వారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి అధికారులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న ఆందోళనలను విరమింపచేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

స‌బితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వైస్ ఛాన్స్‌లర్ నియమాకం కోసం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ వేసే అవకాశం ఉందనే తెలుస్తోంది. ఈ రోజు రాత్రి లోపు ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.

 

Related posts