జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసం అని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు
సోమవారం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కు ఆప్షన్లు లేవని.. ఓడిపోవడమేనని విమర్శించారు. 2019లో పవన్‌ను రెండు చోట్ల ప్రజలు ఓడించారు. 2024లో కూడా అదే రిపీట్ అవుతుందని అన్నారు.
చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం.టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. టీడీపీకి 50 స్థానాల్లో అభ్యర్థులు లేరని లోకేష్ చెప్పారని అన్నారు. బద్వేలుకి మించిన మెజారిటీ ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పోటీ నామా మాత్రమేనని అన్నారు. బద్వేలులో బిజేపీకి వెనుక నుంచి మద్దతు ఇచ్చిన టీడీపీ, జనసేన ప్రయత్నాలు ఫలించలేదని మంత్రి రోజా ఆరోపించారు.
ఏపీలో బీజేపీని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మూడేళ్లలో గౌతమ్ రెడ్డి మంచితనానికి.. సీఎం జగన్ మానవత్వానికి ఆత్మకూరు ప్రజలు ఓటు వేసే సమయం అని అన్నారు. మేకపాటి కుటుంబంపై ప్రజలకు అభిమానం చాటిచెప్పే తరుణం వచ్చిందన్నారు.
వైసీపీ ప్రభుత్వం తీరుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు: సీపీఐ నారాయణ