telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రజావేదిక కూల్చి నేటికి మూడేళ్లు : చంద్రబాబు ఇంటి వద్ద హై టెన్షన్ ..

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది. ప్రజావేదిక కూల్చి నేటికి మూడేళ్లు గడుస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసనకు పిలుపునిచ్చాయి.

దీంతో చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించారు. తెలుగుదేశం పార్టీ నేతలు పెద్దయెత్తున వస్తున్నారని తెలియడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

పెద్దయెత్తున టీడీపీ శ్రేణులు పెద్దయెత్తున అక్కడకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నాయకులను  పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 

అలాగే కృష్ణానది కరకట్టపై వాహనాల రాకపోకలను సైతం పోలీసులు నిలిపివేశారు. ముందుజాగ్రత్తగా బారికేడ్లు, ముళ్ల కంచెలు సిద్ధం చేశారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద నిరసన తెలిపేందుకు తెలుగుదేశం నేతలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

Related posts