*జూబ్లీహీల్స్ బాలిక రేపు కేసులో ట్విస్ట్
*బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు ..
*అబిడ్స్ పీఎస్‌లో ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు
*బాలిక వీడియోలు, ఫోటోలు విడుదల చేయడంపై కేసు
*ఐపిసి228 ఏ సెక్షన్ కింద కేసు నమోదు..
*రేప్ కేసులో ఆధారాలు వెల్లడి..
మంచి చేస్తే చేడు ఎదురైనట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక అత్యాచార కేసులో వీడియోలు, ఫొటోలు వీడియో బహిర్గతం చేయడంతో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల రఘునందన్‌రావు ప్రెస్మీట్లో జుబ్లీహిల్స్ ఘటనకు సంబంధించిన ఆధారాలు కొన్నింటిని మీడియా ముందు బయటపెట్టారు. తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని పోలీసులకు, కోర్టుకి అందచేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. ఆ ఫొటోల్లో ఉన్నది ఓ ఎమ్మెల్యే కుమారుడు అని రఘునందన్ రావు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు అబిడ్స్ పీఎస్‌లో రఘునందన్‌రావుపై కేసు నమోదు అయింది
ఐపీసీ 228(a) సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని అబిడ్స్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇదివరకే ఈ కేసుకు సంబంధించి మూడు యూట్యూబ్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు కావడం తెలిసిందే.