ఎన్నికలో చాలా కుట్ర జరిగిందని, కేంద్ర మంత్రులంతా రాష్ట్రానికి వచ్చారని అన్నారు సీఎం మమత బెనర్జీ. పశ్చిమ బెంగాల్‌కు వెన్నెముక ఉంది.. అది ఎప్పటికీ వంగబోదని అన్నారు. విమానాలు, హోటళ్ళ కోసం వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తనకు తెలియదన్నారు. మంచి నీళ్లలా డబ్బును ప్రవహింపజేశారన్నారు. తాను హింసను ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. బెంగాల్ పట్ల ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమత. రాష్ట్రంలో బీజేపీ హింస సృష్టిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రసంగించిన దీదీ.. ఎన్నికల కమిషన్‌లో తక్షణం సంస్కరణలు జరగాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పరాజయాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు. ఆ పార్టీ తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ సార్వజనీనంగా జరగాలన్నారు. రూ.30,000 కోట్లు అంటే కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తం ఏమీ కాదన్నారు మమత.
previous post
next post


దర్శకనిర్మాతలు రూమ్ లో పెట్టి తాళం వేసేవారు… హాట్ బ్యూటీ కామెంట్స్