telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాకు కుక్క, కొడుకు ఒక్కటే… మలైకా వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్

Malaika

ప్రముఖ బాలీవుడ్ ఐటెం డ్యాన్సర్ మలైకా అరోరా క్యాస్పర్ అనే పొమేరియన్ జాతికి చెందిన కుక్కను ప్రాణంగా పెంచుకుంటున్నారు. ఆమెకు క్యాస్పర్ అంటే ఎంత ఇష్టమంటే రెండో కొడుకులా చూసుకుంటారు. అందులో ఎంతమాత్రం తప్పులేదు. కానీ తనకు కొడుకు, కుక్క ఇద్దరూ ఒక్కటేనని మలైకా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం వివాదాస్పదమైంది. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ “నా కొడుక్కి ఇప్పుడు 17 ఏళ్లు. పెంపుడు జంతువులంటే ఇష్టం ఉన్నవారు వాటిని కూడా కుటుంబంలో భాగంగా చూస్తారు. నాకు నా కుక్క క్యాస్పర్ కూడా అంతే. నాకు క్యాస్పర్, నా కొడుకు సమానమే. ఒక్కోసారి నా కడుకు అర్హాన్ వాడికంటే కుక్కకే ఎక్కువ ప్రేమను పంచుతుంటానని బాధపడుతుంటాడు. అమ్మా.. నీకు నేను ఎక్కువా క్యాస్పర్ ఎక్కువా అని అడిగాడు. నేను ఇద్దరూ సమానమే అని చెప్పాను. దాంతో వాడు బాధపడ్డాడు. వాడికి అన్నీ నేనే. కానీ నేను అలా అనలేదు. అర్హాన్ నా సర్వస్వం. క్యాస్పర్ కూడా అంతే. ఎందుకంటే వాటి నుంచి మనకు నిస్వార్థమైన ప్రేమ లభిస్తుంది. నేను పెట్టే పోస్ట్‌లకు కామెంట్లు వస్తుంటాయి. కానీ నేను వాటిని పట్టించుకోను. నా గురించి తెలిసిన వారి గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను. అన్నీ తప్పుగా అర్థం చేసుకుని కామెంట్స్ చేసేవారిని చూస్తే నాకు బాధేస్తుంటుంది. ఎందుకంటే వారు మానసిక సమస్యలతో బాధపడుతుంటారని నా అభిప్రాయం” అని వెల్లడించారు మలైకా. అర్హాన్.. మలైకా మొదటి భర్త అర్బాజ్ ఖాన్ కుమారుడు. కొన్నేళ్ల క్రితం మలైకా, అర్బాజ్ విడిపోయారు. ఇప్పుడు మలైకా తనకంటే పదేళ్లు చిన్నవాడైన బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉన్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. తన పెళ్లి బీచ్ వద్ద జరుగుతుందని మలైకా ప్రకటించిన విషయం తెలిసిందే.

Related posts