telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ట్రెండింగ్‌‌లో గోపీచంద్ 28 ఫస్ట్ లుక్

Gopichand

మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘గౌతమ్ నంద’ తర్వాత గోపిచంద్, సంపత్ నంది కలయికలో.. ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌పై ‘ప్రొడక్షన్ నెం.3’ గా శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోగా గోపిచంద్ 28వ సినిమా ఇది. మ్యాచో హీరోతో మిల్కీబ్యూటీ తమన్నా జతకడుతుంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో గోపిచంద్, తమన్నా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ జనవరి 27 ఉదయం 8:47 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. టైటిల్ కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. #Gopichand28FirstLook హ్యాష్ ట్యాగ్‌తో గోపిచంద్ 28 ఫస్ట్ లుక్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌‌లో ఉండడం విశేషం.

Related posts