గూఢాచారి సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్నాడు హీరో అడవి శేష్. దాని తరువాత ఎవరు అంటూ అందరిని అలరించాడు. అడవి శేష్ ఎప్పటికప్పుడు కొత్త కథలతో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరిస్తుంటాడు. అలాంటి అడవి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా లో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ కనిపించనున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు బ్యానర్లో నిర్మితమవుతోంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ వారు అంతర్జాతీయంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా శశి కిరన్ దర్శకత్వం లో తెరకెక్కతోంది. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా వదిలింది చిత్ర బృందం. ఈ మూవీని 2021, జూలై 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆదరిస్తోందో చూడాలి.
							previous post
						
						
					
							next post
						
						
					


నాగబాబు కామెంట్-3: కన్నతండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి