మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “సైరా నరసింహారెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. “సై రా నరసింహారెడ్డి”కి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. అమిత్ త్రివేది అందించిన సంగీతం నచ్చడంతో కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే తదుపరి 152వ సినిమాకు కూడా ఆయననే సంగీత దర్శకుడిగా తీసుకోవాలనుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కొరటాల సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే సంగీతాన్ని అందించారు. మరో పక్క మెగా కుటుంబంతో కూడా దేవిశ్రీప్రసాద్‌కి మంచి అనుబంధమే ఉంది. మరి దేవిని పక్కన పెట్టిసి అమిత్ కు అవకాశం ఇస్తారనే వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
next post
అత్యంత చెత్త షో… బిగ్ బాస్ పై హీరోయిన్ ఫైర్