telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్‌బాబుకు మోకాలి సర్జరీ..

సూపర్‌ స్టార్ ఫ్రిన్స్ మహేష్‌ బాబుకి సర్జరీ జరిగింది…గత కొన్నిరోజులుగా మహేష్ మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో మోకాలి శస్త్రచికిత్స కోసం మహేశ్‌ స్పెయిన్ వెళ్లారు. స్పెయిన్ లో మహేష్ మోకాలికి ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో రెస్ట్‌ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

Mahesh Babu lauds Rangasthalam ahead of Bharat Ane Nenu pre-release event -  IBTimes India

ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు న‌టిస్తున్న చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. కాగా.. ఈ చిత్ర షూటింగ్‌లో మ‌హేష్ మోకాలికి చిన్న గాయం అయింది. దీంతో గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న తీవ్ర‌మైన నొప్పితో బాధ‌ప‌డుతున్నార‌ట‌.

ఈ విష‌య‌మై డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించ‌గా.. మోకాలికి స‌ర్జ‌రీ అవ‌స‌రం అని చెప్పడంతో మ‌హేష్‌బాబు స్పెయిన్‌లో స‌ర్జ‌రీ చేయించుకున్నారు. దీంతో డాక్ట‌ర్లు రెండు నెల‌ల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించార‌ట‌. దీంతో ‘స‌ర్కారు వారి పాట‌’ సినిమా షూటింగ్ కు మ‌రో రెండు నెల‌ల బ్రేక్ ప‌డ‌నుంది.

Mahesh Babu asks his Fans to be Patient

అయితే మహేష్‌బాబు.. పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చిందట.. అందుకే షూటింగ్‌ను ఏకంగా రెండు నెలల పాటు వాయిదా వేసినట్టుగా సినీ వ‌ర్గాల స‌మాచారం.

మరోవైపు.. మహేష్ కి మోకాలి సర్జరీ అయిందని తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్‌ మీడియాలో కామెంట్స్, పోస్టులు చేస్తున్నారు

Related posts