telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

త‌లైవా ర‌జ‌నీకాంత్ కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు : మహేష్ బాబు

rajinikanth on loksabha election support

నేడు రజనీకాంత్ (69) పుట్టినరోజు. 12 డిసెంబర్, 1950న బెంగుళూరులో మరాఠీ కుటుంబంలో జన్మించిన రజనీకాంత్‌ తెరమీద మీదే కాదు, తెర వెనుక కూడా కోట్లాది మంది అభిమానుల ఆదరణ పొందారు. ముఖ్యంగా రజనీని స్టార్ కన్నా కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగానే ఎక్కువగా అభిమానిస్తారు. భారతీయ సినీ ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అంతర్జాతీయ స్థాయి నటుడు రజనీకాంత్. జపాన్, సౌదీ, బ్రిటన్, అమెరికా తదితర దేశాల్లో రజనీ సినిమాకు వచ్చే కలెక్షన్లు మరే భారతీయ నటుడి సినిమాకు రావు. రజనీకాంత్ బర్త్‌డేని ఆయన అభిమానులు పండుగలా జరుపుకుంటారు. కాని తాను మాత్రం వాటన్నింటికి చాలా దూరంగా ఉంటారు. దేశ విదేశాల‌లోను ర‌జ‌నీ బ‌ర్త్‌డే వేడుకలు ఘ‌నంగా జ‌రుపుతున్నారు. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న‌కి సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ ద్వారా ర‌జ‌నీకాంత్‌కి బర్త్‌డే విషెస్ అందించారు. “త‌లైవా ర‌జ‌నీకాంత్ స‌ర్‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ఈ సంవ‌త్స‌రం మీరు గొప్ప ఆరోగ్యంతో పాటు సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. మీపై ప్రేమ‌, మ‌ర్యాద మాకు ఎప్ప‌టికీ ఉంటుంది” అని మ‌హేష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts