telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముంబై పోలీసుల‌కు 2 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అక్ష‌య్ కుమార్

Akshay-Kumar

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ మ‌రోసారి త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. తాజాగా ముంబై పోలీసుల‌కు 2 కోట్ల విరాళం ప్ర‌క‌టించి సూప‌ర్‌స్టార్ అనిపించుకున్నారు. గ‌తంలోనూ ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ‌నిధికి 25 కోట్లు, ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌కు 3 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా క‌రోనాపై పోరులో అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న ముంబై పోలీస్ ఫౌండేషన్‌కు త‌న వంతు సాయంగా 2 కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనిపై స్పందించిన ముంబై పోలీస్ క‌మిష‌నర్ ప‌ర‌మ్ బిర్ సింగ్ త‌న అధికారిక ట్విట్ట‌ర్‌లో అక్ష‌య్‌కు కృత‌జ్ఞతలు తెలిపారు. ఈ ట్వీట్‌పై అక్ష‌య్ స్పందిస్తూ.. క‌రోనా కార‌ణంగా మృతిచెందిన హెడ్ కానిస్టేబుల్స్ చంద్రకాంత్ పెండూర్కర్ మరియు సందీప్ సర్వేలకు నివాళులు అర్పించారు. మ‌హ‌మ్మారిపై పోరాటంలో పోలీసులు చేస్తున్న సేవ‌ల‌కు స‌లాం అని పేర్కొన్నారు. పోలీసుల వ‌ల్లే మనం ఇంకా సుర‌క్షితంగా ఉన్నామ‌ని, ముంబై పోలిస్ ఫౌండేష‌న్‌కు త‌మ వంతు విరాళాలు ఇవ్వాల్సిందిగా అభిమానుల‌ను కోరారు. అక్ష‌య్ ఉదార‌త‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అక్షయ్ రీల్ హీరోనే కాదు రియల్ హీరో అని ప్రశంసిస్తున్నారు.

Related posts