telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ బాబు ఖాతాలో మరో సరికొత్త రికార్డ్

even I donot get ticket in AMB said mahesh

సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన చిత్రం శ్రీమంతుడు. సూపర్‌స్టార్ మహేష్ బాబు, అందాల భామ శ్రుతి హాసన్ కలిసి నటించగా ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దీన్ని తెరకెక్కించారు. ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో 99,080,385 మంది వీక్షించగా, ఇంత వ్యూస్‌ని సంపాదించిన మొదటి తెలుగు మూవీగా శ్రీమంతుడు నిలిచింది . త్వరలో 100 మీలియన్ వ్యూస్‌ను కూడా దాటనుంది. మరోవైపు ఇవాళ ట్విట్టర్‌లో కూడా శ్రీమంతుడు సినిమా ట్రెండింగ్‌లో నిలిచింది. 2015 లో విడుదలైన శ్రీమంతుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ2.0 బిలియన్లు వసూళ్ళు చేసింది. ఈ సినిమా తర్వాత మహేష్ తన తండ్రి సొంతగ్రామం బుర్రుపాలెంను కూడా నిజంగానే దత్తత తీసుకున్నాడు. అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాడు. మహేష్ భార్య నమ్రత ఈ వ్యవహారాలన్ని చూసుకుంటున్నారు.

Related posts