telugu navyamedia
సినిమా వార్తలు

“మహర్షి” ట్విట్టర్ రివ్యూ

Maharshi

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం “మహర్షి” రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఇప్పటికే యూఎస్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల బెనిఫిట్ షోలు ప్రదర్శితం కావడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది. ట్విటర్ ద్వారా అభిమానులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మహర్షి సినిమా కథలో ఇన్వాల్వ్ అయ్యేలా ప్రేక్షకుడిని కట్టి పడేసిందని.. ఎమోషనల్ సాగిన క్లైమాక్స్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లిందని, “మహర్షి” ఫస్ట్ హాఫ్ యూత్ అండ్ క్లాస్ ఆడియన్స్ కోసమని, సెకండ్ హాఫ్ మాస్ ఆడియన్స్ కోసం.. ఇది ఓవరాల్ గా ఎమోషనల్ జర్నీ అని, రైతుల గురించి మంచి సందేశం ఇచ్చారని, సినిమాలో రైతుల ఎపిసోడ్ ప్యూర్ గోల్డ్ అని ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది చాలా ఫన్నీ స్టోరీ అని, సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదని, మ్యూజిక్ పై కూడా నెగెటివ్ గా ట్వీట్ చేస్తున్నారు.

Related posts