telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వస్తావా…? అని ఎవరూ అడగరు… క్యాస్టింగ్ కౌచ్ పై స్వాతి సంచలన వ్యాఖ్యలు

Colors-Swathi

“కలర్స్” ప్రోగ్రామ్ తో యాంకర్ గా పాపులర్ అయిన స్వాతి ఆ తరువాత నటిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయింది. అంతేకాదు.. స్టార్ హీరోయిన్ ఇలియానాకి కూడా డబ్బింగ్ చెప్పింది. నిఖిల్, ‘కలర్స్’ స్వాతి హీరోహీరోయిన్లుగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “కార్తికేయ”. 2014లో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభించింది. సుబ్రమణ్య స్వామి ఆలయం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో పడ్డారు దర్శకుడు చందూ మొండేటి. నిఖిల్ హీరోగా “కార్తికేయ-2″ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే ఈ సీక్వెల్ లో ఇద్దరు కథానాయికలు నటించనున్నారట. ఒక కథానాయిక కొత్త అమ్మాయి అయితే, మరో కథానాయిక ‘కలర్స్’ స్వాతి అని సమాచారం. అయితే కొంతకాలం క్రితమే స్వాతికి పెళ్లైపోయింది. దీంతో ఆమె సినిమాలకు దూరమవుతుందని అంతా భావించారు. కానీ “కార్తికేయ-2″లో చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దాదాపు పదిహేనేళ్ల పాటు ఇండస్ట్రీలో పని చేసిన స్వాతి కాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో డైరెక్ట్ గా వస్తావా…? అని ఎవరూ అడగరని.. నేను ఒంటరిగా ఉన్నా నువ్వేం చేస్తున్నావ్ ? అంటూ మాటలు మొదలుపెడతారని చెప్పుకొచ్చింది. అయితే తనతో సరదాగా కాసేపు మాట్లాడడం తప్పితే వ్యక్తిగతంగా అలాంటి అనుభవం తనకు ఎదురుకాలేదని, కానీ నాన్సెన్స్ అని వదిలేసినవి చాలా ఉన్నాయని, అలా రిజెక్ట్ చేయడం వలన వారికి పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ అమ్మాయి అయితే వేస్ట్ అని చెప్పే సందర్భాలు ఉంటాయని, ఏదొక కారణం చెప్పి ఆఫర్స్ ని దూరం చేస్తుంటారని వెల్లడించింది. అయితే ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని చోట్ల ఇలాంటి వాళ్లు ఉన్నారని తెలిపింది. మన హద్దులు దాటకుండా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావని.. తనకు నాన్సెన్స్ అనిపిస్తే ముందే యాక్సెప్ట్ చేయకుండా జాగ్రత్త పడతానని చెప్పింది. అయితే కొంతమందికి మాత్రం సినిమా ధ్యాస తప్ప వేరేదేమీ ఆశించరని, మోహన్ కృష్ణ, అవసరాల, నిఖిల్ ఇలా చాలా మందితో పని చేయడం తనకు కంఫర్టబుల్ గా అనిపించిందని చెప్పుకొచ్చింది.

Related posts