telugu navyamedia
రాజకీయ వార్తలు

మహారాష్ట్ర సీఎం పదవి మాకే ఇవ్వాలి : శివసేన ఎంపీ డిమాండ్

shivasena bjp

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతున్నాయి. ఈ తరుణంలో సీఎం పదవి తమకే ఇవ్వాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా ప్రభుత్వ పదవులన్నీ ఫిఫ్టీ-ఫిఫ్టీ పంచుకోవాలని ఆయన అన్నారు. మహారాష్ట్రలో గతంలో కంటే బీజేపీ స్థానాలు తగ్గాయి. శివసేన డిమాండ్ చేయడానికి ఇదే ప్రధాన కారణమై ఉండోచ్చని ఊహాగాణాలు వెలువడుతున్నాయి.

103 స్థానాల్లో బీజేపీ, 68 స్థానాల్లో శివసేన, కాంగ్రెస్ 41 స్థానాల్లో, 49 స్థానాల్లో ఎన్సీపీ, ఇతరులు 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. శివసేన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడంతో సంజయ్‌ రౌత్ సీఎం పదవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషయం తాను పార్టీ అధినేత ఉద్దవ్ థాకరేతో సమావేశమై చర్చించనున్నట్లు వెల్లడించారు.

Related posts