telugu navyamedia
క్రీడలు వార్తలు

తన అసహనాని వెలిబుచ్చిన కుల్దీప్ యాదవ్…

2020 t20 world cup is kuldeep target

ఆస్ట్రేలియాతో రెండేళ్ల క్రితం జరిగిన టెస్టు సిరీస్‌లో చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అసహనం వ్యక్తం చేశాడు…. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టుతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఆ మ్యాచ్‌లో 6.2 ఓవర్లు వేసిన కుల్దీప్‌.. 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ ఆ తర్వాత మ్యాచ్‌లలో ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు. అంతేకాదు పుణెలో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడంతో టీమ్‌మేనేజ్‌మెంట్ కూడా అతన్ని పక్కనపెట్టేసింది. ఈ పరిణామాలన్నిటినీ తాజాగా ప్రస్తావించిన కుల్దీప్.. తాను చాలా అసహనానికి గురైనట్లు చెప్పుకొచ్చాడు. ‘నాన్‌స్టాప్‌గా ఆడుతూ ఉంటే.. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ ప్రతిసారీ బెంచ్‌ మీదే కూర్చోవాల్సి వస్త పరిస్థితులు కఠినంగా మారతాయి. ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. నేను చాలా కాలం తర్వాత ఫిబ్రవరిలో చెన్నైలో ఇంగ్లండ్‌తో టెస్టు ఆడినపుడు ఇలాగే అనిపించింది. మరోవైపు కోవిడ్‌ కల్లోలం పరిస్థితులను మరింత ప్రతికూలంగా మార్చింది. నాకు ఒక్కోసారి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కఠిన సమయాల్లో నా మనసు ఒకటే మాట చెబుతుంది.. నువ్వు మనుపటి కుల్దీప్‌ కాదేమో.. బహుశా అలా ఉండలేవేమోనని.. డ్రింక్స్‌ మోస్తూ… పదే పదే బెంచ్‌ మీద కూర్చోవడం.. చాలా కఠినంగా ఉంటుంది.’అని కుల్డీప్ చెప్పుకొచ్చాడు. కేకేఆర్‌ తరఫున ఆడే అవకాశం రాకపోవడం తనను మరింత ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.

Related posts