telugu navyamedia
రాజకీయ

సామాన్యుడుపై గ్యాస్ బాంబ్‌..!

గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి బ‌గ్గుమ‌న్నాయి. అస‌లే క‌రోనా కాలం ఉద్యోగాలు లేక ఉపాది కొల్పోయి సామాన్య‌డు ఉక్కికిబిక్కిరి అవుతున్న స‌మ‌యంలో.. మ‌రో వైపు ప్ర‌తినేల గ్యాస్ ధ‌ర‌లు రెట్టింపు చేస్తూ స‌మాన్య‌డుపై భారం మోపుతున్నారు. ప్రభుత్వరంగ చమురు సంస్థలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను సిలిండర్ పై రూ. 73.5 పెంచింది. ఈ కొత్త ధరలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చాయి. అలాగే 14.2 కిలోల దేశీయ ఎల్‌పి‌జి సిలిండర్ ధరలలో మాత్రం ఎటువంటి మార్పులేదు.

దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ లేని ఎల్‌పి‌జి సిలిండర్ ధర రూ. 834.50, ముంబైలో రూ .834.50, కోల్‌కతాలో రూ.861 ,చెన్నైలో సిలిండర్‌కు రూ. 850.50గా ఉంది. హైదరాబాద్‌లో రూ.887లుగా ఉంది. ఈ నేప‌థ్యంలో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర వెయ్యికి చేరువైంది.

ఈ ఏడాది 2021లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.138.50 పెంచారు. 1 జనవరి 2021న 14.2 కిలోల దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.694 వద్ద ఉంది. ఈ గ్యాస్ ధ‌ర‌లు 20 రోజుల్లో పెంచ‌డం మూడోసారి. గ‌త మూడువార‌ల్లో 100 పైగా ధ‌ర‌లు పెరిగాయి.

Related posts