telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఆస్పత్రుల్లో చెల్లని ఆయుష్మాన్ భారత్ కార్డు.. అనారోగ్యంతో వ్యక్తి మృతి

1050 more medical seats to telangana

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అర్హులైన లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను అందజేశారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఓ నాలుగు ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ కార్డు చెల్లలేదు. ఈ కార్డు చూపిన వెంటనే వైద్యులు చికిత్సకు నిరాకరించారు. దీంతో 59 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బరేలికి చెందిన మాత్లవ్ హుస్సేన్(59)కు బుధవారం రాత్రి జ్వరం వచ్చింది. ఈ క్రమంలో ఆయనను బుధవారం రాత్రి 9 గంటలకు సివిల్ లైన్స్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆయుష్మాన్ కార్డు చూపించేసరికి డాక్టర్ సెలవులో ఉన్నాడని అక్కడున్న సిబ్బంది చెప్పారు.

చివరకు జంక్షన్ రోడ్డులోని మరో ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయుష్మాన్ కార్డు గురించి చెప్పేసరికి తమ ఆస్పత్రి ఆ పథకంతో ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 3 గంటల వరకు నాలుగు ఆస్పత్రులు తిరిగిన ఆయుష్మాన్ కార్డు చెల్లదని.. హుస్సేన్‌కు వైద్యం చేయలేదు. దీంతో హుస్సేన్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచాడు.

Related posts