తిరుపతి ప్రచారం జోరుగా సాగుతోంది. విజయమే లక్ష్యంగా అన్నీ పార్టీలు ప్రచారం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి టిడిపి అధినేత చంద్రబాబు.. తిరుపతి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభపై రాళ్ళ దాడి జరిగింది. అయితే ఈ ఘటనపై నారా లోకేష్… వైసీపీపై నిప్పులు చెరిగారు. జగన్ ది ప్రిజనరీ బుద్ధి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు లోకేష్. “ఇదే తిరుపతి కొండపైన స్మగ్లర్లు, తీవ్రవాదులతో కలిసి 24 క్లైమోర్ మైన్లు పెట్టి పేల్చితే సాక్షాత్తు ఏడుకొండలవాడే కాపాడిన ప్రాణం చంద్రబాబు గారిది.ఏ ఒక్కరూ బతికే అవకాశంలేని దాడి నుంచి తేరుకుని సహచరులు ఎలా ఉన్నారని వాకబు చేసిన గుండె ధైర్యం చంద్రబాబు గారిది. నీలాంటి ఫ్యాక్షన్ కుక్కమూతిపిందెలు వేసే రాళ్లు ఆయనని భయపెట్టలేవు. జగన్ నీ ప్రిజనరీ బుద్ధితో రాళ్లేయిస్తే,అదే రాళ్లతో జనానికి పనికొచ్చే ఒక నిర్మాణం చేయించగల విజనరీ చంద్రబాబు గారు.తిరుపతిలో నా సవాల్ కి తోకముడిచి తొలి ఓటమి అంగీకరించావ్. చంద్రబాబు గారి సభలకు వస్తున్న జనాన్ని ఓర్వలేక నీ రౌడీమూకలతో రాళ్ల దాడి చేసి రెండో ఓటమిని ఒప్పుకున్నావు జగన్!” అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.
previous post