telugu navyamedia
ఆంధ్ర వార్తలు

దావోస్ కు వెళ్ళాల్సిన సీఎం జ‌గ‌న్ లండన్‌లో ల్యాండ్‌..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన తొలి అధికారిక విదేశీ పర్యటనపై మీడియాలో అనూహ్య కథనాలు బ‌య‌ట‌కు వస్తున్నాయి.

ప్రపంచ ఆర్థిక సదస్సులో మన రాష్ట్రం గురించి చెప్పి, పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం జగన్‌ దావోస్‌ వెళ్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కానీ డబ్ల్యూఈఎఫ్ సదస్సు కోసం దావోస్ వెళ్లిన సీఎం విమానం మరో చోట ల్యాండ్ అయిందని, సీఎం వెంట సతీమణి భారతి కూడా ఉన్నారని తెలుస్తోంది.

ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా దావోస్(స్విట్జర్లాండ్‌) వేదికగా జరుగుతోన్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో సీఎం బృందం కీలకంగా వ్యవహరించనుంది. దాదాపు 10రోజుల విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ ఈనెల 22 నుంచి 26 వరకు దావోస్ సదస్సులో పాల్గొంటారు.

కాగా, ప్రత్యేక విమానంలో సీఎం జగన్ దావోస్ వెళ్లిన మార్గంపై, విమానం మధ్యలో దారిమళ్లిన వైనంపై ఓ మీడియా సంచలన కథనం రాసింది.

సీఎం జగన్ అధికారిక విదేశీ పర్యటన గుట్టుగా సాగుతోందని, ప్రభుత్వ యంత్రాంగం చెప్పినట్లు కాకుండా మరోలా జరుగుతోందని, ముందస్తు షెడ్యూలులో మార్పులతో డీవియేషన్లతో విమాన ప్రయాణం సాగిందని ఓ ప్ర‌ముఖ మీడియా ఒక కథనం రాసింది.

ఏపీ నుంచి దావోస్ వెళ్లే బృందంలో సీఎం జగన్‌ సతీమణి భారతి రెడ్డి కూడా ఉన్నారని తొలుత వెల్లడికాలేదని, అయితే శుక్రవారం స్పెషల్‌ ఫ్లైట్‌లో ఎక్కిన తర్వాతే సీఎం సతీసమేతంగా వెళుతున్నట్లు అర్థమైందని, ఆ విమానం కూడా అనూహ్యంగా దారి మళ్లి లండ‌న్‌లో లాండ్ అయింద‌ని కథనంలో రాశారు.

Related posts