telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జోరు వాన‌లో మొద‌లైన ముఖ్యమంత్రి జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌..

*కోన‌సీమ లంక గ్రామాల్లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌
*జోరు వ‌ర్షంలో మొద‌లైన జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌..
*పంటులో పుచ్చ‌కాయ‌ల‌వారి పేట బ‌య‌లుదేరిన సీఎం జ‌గ‌న్‌

కొన‌సీమ లంక గ్ర‌మాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంది. పి.గన్నవరం మండలం జి. పెదపూడి సీఎం జగన్ చేరుకున్నారు. భారీ వ‌ర్షంలో ముంపు బాధితుల‌కు ప‌రామ‌ర్శిస్తున్నారు. వరద బాధితులకు వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. 

అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుంటారు.

ఆ త‌రువాత అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుని.. వరద బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్‌ బస చేయనున్నారు. బుధవారం కూడా జ‌గ‌న్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు.

Related posts