telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

వీడి అంతఃకరణ శుద్ధి సంతకెళ్ళ .. ఎంత ఫ్లెక్సీ ఫ్రీ అయితే .. శోభనానికి కూడానా..

groom flex on first night program

దేవుడు ఎక్కడో లేదు మనమధ్యనే తిరుగుతుంటారని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది..ఈ అనుభవం అందరికి ఉంటుంది. లేకుంటే ఇప్పుడు వస్తుంది లెండి. కొందరు చేసే పనులు చూస్తే .. దేవుడు ఖచ్చితంగా కనిపిస్తాడు.. కనీసం తలుచుకోవాలనిపిస్తుంది. ఇలాంటివి కొంతమంది అమాయకత్వంతో చేస్తుంటే మరికొందరు తమ కి తాము ప్రచారం చేసుకొనేందుకు చేస్తుంటారు. అయితే బలయ్యేది మాత్రం దానిని చూసినవాడే.

తాజాగా ఓ యువకుడు తన పెళ్ళికి అందరిని పిలిచాడో లేదో కానీ, పిలిచే ఉంటాడు, ఎవ్వరు రాలేదనుకుంటా.. అందుకే సొంత ప్రచారం అన్నా చేసుకుందామని అనిపించిందేమో ఆ బుర్రకి.. అనుకున్నదే తడవు .. క్రిందివిధంగా ఫ్లెక్సీ వేయించాడు. groom flex on first night program

భారత్ అనే నేను బాగా బుర్రకి ఎక్కినట్టే ఉంది.. ఆ ఫ్లెక్సీలో అంతఃకరణ శుద్దితో అంటూ.. కొసమెరుపు ఇచ్చాడు. దేవుడా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా.. అని అనిపిస్తుంది కదా! తప్పదు ఇలాంటి వాళ్ళని చూస్తే దేవుడు కనిపిస్తాడంతే.

Related posts