telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తల్లిదండ్రుల డబ్బు దొంగిలించి… వారినే హతమార్చాలనుకుంది…!

Florida

అమెరికా, ఫ్లోరిడాలోని ఉమటిల్లా హై స్కూల్‌లో చదువుతున్న అలిస్సా హాట్చర్ (17) అనే బాలిక కన్నవారిని కడతేర్చేందుకు వారి డెబిట్ కార్డు నుంచే ఏకంగా 1500 డాలర్లు (రూ. లక్ష 6వేలు) దొంగిలించి కిరాయి హంతకులకు ఇచ్చింది. తండ్రి డెబిట్ కార్డు నుంచి మొదటిసారి 500 డాలర్లు విత్‌డ్రా చేసిందామె. అందులో వంద డాలర్లు పెట్టి కొకైన్ కొన్నది. మిగిలిన 400 డాలర్లు ఓ వ్యక్తికి ఇచ్చి తన పేరెంట్స్‌ను చంపేయాలని చెప్పింది. కాని ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. దీంతో రెండోసారి ఏకంగా 900 డాలర్లు విత్‌డ్రా చేసిన ఆమె వాటిని మరో వ్యక్తికి తన తల్లిదండ్రులను హతమార్చాలని సుపారి ఇచ్చింది. అయితే, హాట్చర్ ప్లాన్ గురించి తెలుసుకున్న ఆమె తోటి విద్యార్థిని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఉదాంతం బయట పడింది. దీంతో హాట్చర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెపై దొంగతనం, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమెను బాల నేరస్తుల జైలులో ఉంచారు. కాగా ఆమె తల్లిదండ్రులు చాలా మంచి వ్యక్తులని తమ విచారణలో తేలిందని లేక్ కౌంటీ పోలీస్ అధికారి ఫ్రెడ్ జోన్స్ తెలిపారు. కాని హాట్చర్ ఎందుకిలా వాళ్లను హతమార్చాలని చూసింది అనే విషయమై విచారిస్తున్నామని జోన్స్ పేర్కొన్నారు.

Related posts