telugu navyamedia
రాజకీయ వార్తలు

మద్యం డోర్ డెలివరికీ అమెజాన్ కు అనుమతి

liquor shops ap

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటింటికీ మద్యం చేర్చేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన  లఅమెజాన్, బిగ్ బాస్కెట్కు అనుమతించింది. ఇండియాలో ఓ రాష్ట్ర ప్రభుత్వం మద్యం హోమ్ డెలివరీకి అనుమతించడం ఇదే తొలిసారి. ఈ మేరకు వెస్ట్ బెంగాల్ స్టేట్ బీవరేజస్ కార్పొరేషన్ నుంచి అనుమతులు వచ్చాయని అమెజాన్ స్పష్టం చేసింది.

ఇండియాలో అత్యధికంగా జనాభా ఉన్న 4వ రాష్ట్రంగా ఉన్నపశ్చిమ బెంగాల్ లో దాదాపు 9 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. కాగా, లాక్ డౌన్ కారణంగా అన్ని రకాల వ్యాపారాలు నష్టపోయి, ప్రభుత్వ ఖజానా పై ప్రభావం చూపింది. నిబంధనల సడలింపు అనంతరం కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Related posts