telugu navyamedia
క్రీడలు వార్తలు

అభిమానులను నిరాశ పరిచిన విరుష్క…

వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం సిద్దం అవుతున్న విరాట్.. ముంబై వేదికగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయో‌బబుల్‌లో క్వారంటైన్ పాటిస్తున్నాడు. ఈ క్వారంటైన్ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. అయితే ఈ చిట్ చాట్ సందర్భంగా ఓ అభిమాని విరాట్ కోహ్లీ ముందు తన గారాల పట్టి వామికా గురించి ప్రస్తావించాడు. అసలు ‘వామికా’ అంటే అర్థం ఏంటని? ఆమె ఫొటోను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించాడు. దీనికి విరాట్ స్పందిస్తూ.. వామికా అంటే దుర్గాదేవి అని, తన కూతురికి సోషల్ మీడియా అంటే ఏంటో తెలిసే వరకూ ఆమె ఫొటోను బయటకు చూపించబోమని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక వామికా పుట్టిన సందర్భంగానే పప్పరాజీలు(ఫొటోగ్రాఫర్లకు) తమ కూతురి ప్రైవసీ భంగం కలిగించకుండా ఉండాలని, ఫొటోలు తీయవద్దని ఈ జోడీ విజ్ఞప్తి చేసింది. వారి రిక్వెస్ట్‌ను బేఖాతరు చేసిన ఫొటోగ్రాఫర్లపై అనుష్క ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే ఇప్పటి వరకు వామికా ముఖం కనిపించేలా ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు.

Related posts