telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ప్రధాని పిలుపుపై కేంద్ర విద్యుత్ శాఖ వివరణ

modi speech on J & K

దేశ పౌరులంతా కరోనాను తరిమికొట్టేందుకు రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని విద్యుత్ లైట్లు అన్నీ ఆఫ్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని దేశప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఒకేసారి లైట్లు స్విచ్ఛాఫ్‌ చేయడం వల్ల పవర్‌గ్రిడ్‌ కుప్పకూలుతుందని కొన్ని రాష్ట్రాల్లో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోకేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు లేఖ రాసింది. రేపు రాత్రి లైట్లు ఆర్పే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

గ్రిడ్లపై ఒకేసారి ప్రభావం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ విద్యుత్ దీపాలను మాత్రమే ఆపాలని చెప్పారని, ఇంట్లోని ఇతర పరికరాలను కూడా ఆపాలని ఎక్కడా చెప్పలేదని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. వీధిలైట్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలని, ఆసుపత్రులు, ఇతర అత్యవసర ప్రదేశాల్లో లైట్లు ఆపాల్సిన పనిలేదని తెలిపింది.

Related posts