telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఉదయ్ పూర్ లో అల్లు అర్జున్ కి అరుదైన గౌరవం…

Allu-Arjun

తాజాగా ఉదయ్ పూర్ వేదికగా మెగా డాటర్ నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లిలో అల్లు వారు, కొనిదెల వారి సందడి అంతా ఇంతా కాదు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు ప్రత్యేక విమానాల్లో రాజస్థాన్ ఉదయ్ పూర్ చేరుకున్నారు. ఈ ప్రయాణంటో ఎవ్వరూ ఊహించని విధంగా బన్నీకి అరుదైన గౌరవం లభించింది. ఎందుకని తెలుసుకోవాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లాలి. బన్నీ ఎక్కడికి వెళ్ళినా రెండు విషయాలను పాటిస్తాడు. అంతేకాకుండా అందరూ కూడా వాటిని గమనిస్తారు. ఒకటి అతడి స్టైల్, మరొకటి అతడి సామాజిక బాధ్యత వీటిని అందరు తప్పకుండా గుర్తిస్తారు. ఇదే విధంగా నిహారికి పెళ్లికి హాజరయినప్పుడు కూడా బన్నీ అన్ని కరోనా నిబంధనలను పాటించాడు. దాంతో అక్కడి సిబ్బంది బన్నీని చప్పట్లతో ఆహ్వానించారు. అందరూ అదే విధంగా నిబంధనలు పాటిస్తే కరోనాను నియంత్రివచ్చని, మీరు ఎందరికో స్ఫూర్తిగా ఉంటారిన ఈ అరుదైన గౌరవం ఇచ్చారు. అంతేకాకుండా అక్కడ ఉన్నంత సేపు బన్నీ మాస్క ధరించే ఉన్నాడు. ఆ ఫొటోను ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టు సిబ్బంది షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని బన్నీ ఫాన్స్ మన రాష్ట్రలో వైరల్ చేస్తున్నారు.

Related posts