అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన లావణ్య త్రిపాఠి ట్రిపోఫోబియాతో బాధపడుతున్నట్లు ఇన్ స్టా లైవ్ సెషన్ లో అభిమానులతో చెప్పింది. ‘నాకు ట్రిపోఫోబియా ఉందని షాక్ ఇచ్చింది. కొన్ని ఆకారాలను, వస్తువులను చూస్తే తెలియకుండానే నాలో భయం కలుగుతుంది. చాలా రోజులు నుంచి ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.
తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి..తర్వాత వరుస ఆఫర్లతో తెలుగు, తమిళ భాషల్లో బిజీ అయిపోయింది. అటు సినిమాలతో పాటు..సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈమె తన ఇన్స్టా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. తనను నెటిజన్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం తను ఆహ్లదకరమైన జీవితాన్ని చూస్తున్నానని, కాంక్రిట్ జంగిల్‌కు దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ఒత్తిపరమైన ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందుతున్నట్లు చెప్పింది.
ప్రస్తుతం ఇంటికే పరిమితమైన లావణ్య కొత్త కథలు వింటూ ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలిపింది. మనం సంతోషంగా లేనప్పుడు ఇతరులకు కూడా ఎలాంటి ఆనందాన్ని పంచలేము. ఈ సిద్దాంతాన్ని నేను బాగా నమ్ముతాను. మన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందనేది అప్పుడప్పుడు తెరచి చూసుకోవడం ముఖ్యం అని, స్వీయ విశ్లేషణ వలనే నేను చేసే తప్పొప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే మన జీవన శైలి సక్రమంగా సాగుతుంది. అలాగే తను నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, అందుకే ప్రస్తుతం తను స్వల్ప విరామం తీసుకోవాలనుకుంటున్నట్లుగా తెలిపింది. త్వరలోనే మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చెప్పింది.
మొదటి నుంచీ అయోమయ ప్రకటనలు… కరోనా నుంచి ఉపశమనం ఎప్పుడు… : విజయశాంతి