telugu navyamedia
సినిమా వార్తలు

63 సంవత్సరాల “టాక్సీ రాముడు”

నటరత్న పద్మశ్రీ ఎన్.టి. రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం శ్రీ రామకృష్ణ ప్రొడక్షన్స్ వారి “టాక్సీ రాముడు” 18-10-1961 విడుదలయ్యింది.

నిర్మాతలు డి.వి.కె.రాజు, కె.రామచంద్రరాజు, కె.ఎన్.రాజు, సి.యస్.రాజు లు శ్రీ రామకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు వి.మధుసూదనరావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: వి. మధుసూదనరావు, మాటలు: సముద్రాల రామానుజాచార్య, పాటలు: సముద్రాల రాఘవాచార్య, కొసరాజు, ఆరుద్ర, సముద్రాల రామానుజాచార్య,, వెంపటి సదాశివబ్రహ్మం, మల్లాది రామకృష్ణశాస్త్రి, సంగీతం: టి.వి.రాజు, ఛాయాగ్రహణం: సి.నాగేశ్వరరావు, కళ: తోట వెంకటేశ్వరరావు, నృత్యం: చిన్నిలాల్, సంపత్, ఎడిటింగ్: ఎన్.ఎస్.ప్రకాశం, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, దేవిక, జగ్గయ్య, గుమ్మడి , రేలంగి , గిరిజ, రాజనాల , రాగిణి, కె.వి.యస్.శర్మ, మహాంకాళి వెంకయ్య, ఋష్యేంద్రమణి, ఛాయాదేవి, చదలవాడ తదితరులు నటించారు.

ప్రఖ్యాత సంగీత దర్శకుడు టి.వి.రాజు గారి స్వరకల్పనలో
“రావోయి మనసైన రాజా”,
“శోకించకోయూ ఓ భగ్నజీవి, విధి నీపై పగజూపెనోయి”
“గోపాల బాల,కాపాడవేలా”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి.

ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకుని పలుకేంద్రాలలో అర్ధశతదినోత్సవాలు జరుపుకుని 60 రోజులు పైగా ప్రదర్శింపబడింది..

Related posts