telugu navyamedia
ఆరోగ్యం

దానిమ్మతో బ్ల‌డ్ లెవ‌ల్స్ హై..!

కాలంతో సంబంధం లేకుండా ప్రతీ సీజన్‌లో అందుబాటులో ఉండే పండ్లలో దానిమ్మ ఒకటి. చూడడానికి ఎంతో అందంగా ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. ఈ పండులో రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

1. గర్భస్థశిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణులు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుందని ఆరోగ్య నిపుణులు వెల్ల‌డించారు.

Instant Pot Pomegranate Juice - Corrie Cooks

2. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు నోటి పూతనుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.

3. రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు విరుగుడు దానిమ్మ రసం. గుండె జబ్బులకు చెక్‌ పెట్టడానికి కూడా దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది.

Menstruation does not affect women's brains despite claims otherwise, study finds | The Independent | The Independent

4. దానిమ్మపండులో ఉండే పోషక విలువలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. ఈ కారణంగా గుండె పోటు వచ్చే ప్రమాదం తప్పించుకోవచ్చు.

5.దానిమ్మ పండు కేవలం ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది. దానిమ్మ రసంలో ఒక స్పూన్‌ పంచదార, ఒక స్పూన్‌ తేనె వేసిన ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.

Newest > pomegranate for skin glow | Sale OFF - 71%

6. పైల్స్‌ సమస్యకు కూడా దానిమ్మ మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయం దానిమ్మ గింజలకు కొంచెం ఉప్పును కలుపుకొని తింటే.. పైల్స్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

7. దానిమ్మ గింజలు కీళ్లవాతాన్ని మరియు ఆర్థరైటిస్ జబ్బును నయం చేస్తాయి. ఎందుకంటే వీటిల్లో ఫ్లేవనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గించటానికి పనిచేస్తాయి. మీకు కీళ్ల నొప్పులు ఉంటే తరచుగా దానిమ్మలను తింటూ ఉండండి.

Doctor are shocked - Why Pomegranates Good For Diabetes Patients? - YouTube

 

8. దానిమ్మ గింజలు డయాబెటిస్ వారికి చాలా ఉపయోగకరం. ఈ గింజలలో ఉండే కొన్నిరకాల యాసిడ్లు మధుమేహ వ్యతిరేక లక్షణాలను కలిగిఉంటాయి. దానిమ్మ గింజలలో కల పిండి పదార్థాలలో కూడా కొన్ని ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు ఉండి అవి టైప్ 2 డయాబెటిస్ ను నివారించటంలో సాయపడతాయి.

Related posts