telugu navyamedia
సినిమా వార్తలు

ప్ర‌భుత్వ లాంఛనాలతో లతామంగేష్కర్‌ అంత్య‌క్రియ‌లు..

గాన‌కోకిల‌, భారత రత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్‌(92) ఆదివారం ఉదయం క‌న్నుముశారు. ఇటీవ‌ల కరోనా బారినపడి కోలుకున్న లతా మంగేష్కర్.. ముంబయిలోని బ్రీచ్​ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో యావత్‌ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది.

కొన్ని వేల పాటలతో సినీ లోకాన్ని మైమరిపించిన లతా మంగేష్కర్ గొంతు మూగబోయిందని తెలిసి ఆమె అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

 ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, హోంమంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీ, ప్రియాంక‌గాంధీ సహా సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తూ ఆమెకు నివాళులర్పించారు.

తామరైపాక్కంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి - BBC News తెలుగు

ఆమె భౌతిక కాయానికి ప్రజలు నివాళులు అర్పించేందుకు వీలుగా ఆమె పార్థివ దేహాన్ని తన నివాసంలో ఉంచనున్నారు. ఆ తర్వాత అంతిమయాత్ర మొదలవుతుంది. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు శివాజీ పార్క్ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

శివాజీ పార్క్‌లో లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ కూడా సాయంత్రం 4:15 గంటలకు ముంబై చేరుకుని లతాజీ చివరిసారిగా కన్నీటి నివాళిని అర్పించనున్నారు. అయితే ప్రధాని మోడీ అంత్యక్రియల్లో పాల్గొంటారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. 

ల‌తాజీ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ జ్ఞాపకార్థంగా రెండు రోజుల పాటు జాతీయ సంతాపదినాలు సంతాప దినాలు ప్రకటించింది. గౌరవ సూచకంగా రెండు రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయాలని అధికార వర్గాలు వెల్లడించాయి. 

Related posts