telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఈ ప్రభుత్వం మీది… మీరు లేకపోతే నేను లేను..

* ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుందిఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధం..

*ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు

*రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా… మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు.

*భావోద్వేగాలకు పెద్దగా తావు ఇవ్వకండి..

*30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు

ఉద్యోగులు లేకపోతే తాను లేనని, వారికి మంచి జరిగేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సీఎం జగన్ అన్నారు. ఈ ప్రభుత్వం మీది… మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నానని అన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగుంటే ఉద్యోగులకు మరింత మంచి చేసేవాడినని, అర్థం చేసుకుని సహకరించినందుకు ఉద్యోగస్తులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాన్నారు.

ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె విరమించి.. నేడు తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చన్నారు.ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చని.. కానీ ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేశామన్నారు.

Andhra DGP meets CM after massive protest by employees

రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుందన్న ముఖ్యమంత్రి.. రాజకీయాలకు తావు ఉండకూడదని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్‌ కమిటీకూడా ఉంది. భావోద్వేగాలకు తావివ్వవద్దని, ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చు అని హామీ ఇచ్చారు.

ఈ పరిస్థితులు ఈ మాదిరిగా ఉండకపోయి ఉంటే… మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని అని, దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయి.మినిమం టైం స్కేలు వర్తింపు చేశాం, అన్నిరకాలుగా ఆయా జీతాలు పెంచాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చర్చలు జరిగాయి.

రాబోయే రోజుల్లో సీపీఎస్ మీద గట్టిగా పని చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందని, ఏ సమస్య ఉన్నా వారితో చెప్పుకోవచ్చన్నారు.

అదేవిదంగా కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నామని ప్రకటించారు. 30 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నామన్నారు. అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దామన్నారు. పీఆర్సీ విషయంలో మంచి ఆలోచన వచ్చిందని, ఎక్కడా ఉద్యోగులు డిమాండ్ చేయలేదన్నారు.

‘ఐఆర్‌ ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ, 9 నెలల ఐఆర్‌ను సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ.5400 భారం పడుతోంది. హెచ్‌ఆర్‌ఏ రూపంలో అదనంగామరో రూ.325 కోట్లు భారం పడుతోంది. అదనంగా భారం పడేది కాకుండా రికరింగ్‌ వ్యయం రూపేణా హెచ్‌ఆర్‌ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌ క్వాంటమ్‌ పెన్షన్, సీసీఏ రూపంలో మొత్తంగా రూ.1330 కోట్లు భారం పడుతోంది. మొత్తంగా రూ.11,500 కోట్లు రికరింగ్‌గా భారం పడుతోంది..’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా… మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం అని ఉద్యోగులతో జ‌గ‌న్ వెల్ల‌డించారు.

Related posts