telugu navyamedia
సినిమా వార్తలు

“బంగార్రాజు” నుంచి మాస్ సాంగ్ ..

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న కొత్త‌ సినిమా బంగార్రాజు. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించగా 2019లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్‌గా ఈ బంగార్రాజు తెరకెక్కుతోంది.

Naga Chaitanya and Nagarjuna begin filming for Bangarraju : Bollywood News - Bollywood Hungama

ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా..నాగచైతన్యకు జోడీగా స‌ర‌స‌న కృతి శెట్టి లు న‌టిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్ట‌ర్స్‌, వీడియోలు. టీజర్స్ , పాటలు అక్కినేని అభిమానులను ఎంత‌గానో ఆకట్టుకుంటున్నాయి.

Naa Kosam Song From Bangarraju Unveiled | Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com - English

తాజాగా ఈ చిత్రం నుండి మరొక లిరికల్ విడియో సాంగ్ విడుదలకి సిద్దం అయింది. ఈ సినిమా నుండి ” నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు.. మాకెవ్వరు కొనిస్తారు కోకా బ్లౌజు” అంటూ ఊర మాస్ స్టెప్పులతో కనిపించింది.

Bangarraju's Teaser Unveiled On Naga Chaitanya's Birthday | Filmfare.com

“వాసివాడి వాసివాడి తస్సాదియ్యా.. పిల్ల జోరు అదిరిందయ్యా” అంటూ సాగిన టీజ‌ర్‌ ఆకట్టుకొంటోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

Related posts