నేడు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (ఫిబ్రవరి 13) ముగియనున్నాయి. గత నెల 31వ (జనవరి) తేదీన ప్రారంభమైన సమావేశాలు ఈ రోజు ముగియనున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు. ఆ తర్వాత రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందు ఇవే చివరి సమావేశాలు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం, కాగ్ రిపోర్ట్, రాఫెల్ డీల్ తదితర అంశాలను విపక్షాలు సభలో ప్రస్తావించే అవకాశముంది.
అయితే గత రెండు రోజులుగా ఏపీసీఎం చంద్రబాబు అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన దీక్ష అందరికి తెలిసిందే. ఈ దీక్షా వేదికగా చంద్రబాబు, పార్లమెంట్ లో ఏపీ గురించి చర్చకు తేవాలని, ఇచ్చిన హామీలను ఉన్న సమయంలో అయినా నెరవేర్చాలని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సమయాన్ని కూడా సరిగా వినియోగించుకోకుంటే, పరిస్థితులు తీవ్రంగా ఉండనున్నాయని చంద్రబాబు దీక్ష అనంతరం మాట్లాడుతూ అన్న విషయం విదితమే. ఆ ప్రకారంగా నేడు చర్చ జరిగేనా అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఆఖరిరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది…