telugu navyamedia
రాజకీయ

సంకల్ప్ పాత్ర పేరుతో.. బీజేపీ మేనిఫెస్టో విడుదల

బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం విడుదల చేసింది. సంకల్ప్ పాత్ర’ (వాగ్దానాల పత్రం) పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దీనిని విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ అమిత్‌ షా మాట్లాడుతూ.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్న నేపథ్యంలో 75 హామీలతో ఈ మేనిఫెస్టోను తీసుకొచ్చినట్లు అమిత్ షా వెల్లడించారు. 2022లో భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్నది. ఆలోపు తాము ఇచ్చిన ఈ 75 హామీలు నెరవేరుస్తామని షా స్పష్టం చేశారు. 
మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో అనేక హామీలు ఇస్తూ నమ్మలేని వాతావరణం సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది చాలా ముందు చూపుతో కూడిన ఆచరణాత్మక మేనిఫెస్టో అని అన్నారు. తనతోపాటు కమిటీలో 12 మంది సభ్యులు ఉన్నారని, దీనికితోడు వివిధ సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసి అన్ని అంశాలపై అధ్యయనం చేశామని చెప్పారు.

Related posts