telugu navyamedia
సినిమా వార్తలు

“లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు బాలకృష్ణే ప్రేరణ “- రామ్ గోపాల్ వర్మ 

Laxmis NTR movie compliant CEC
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం నాడు హైదరాబాద్ పార్క్ హయత్ లో జరిగింది . ఈ కార్యక్రమంలో అతిధులుగా పోసాని కృష్ణ ముర్లలో, పృద్వి , లక్ష్మీస్ పార్వతి హాజరయ్యారు . ఈ ముగ్గురు వై .సి పి  పార్టీకి చెందినవారు కావడం విశేషం . నిర్మాత రాకేష్ రెడ్డి కూడా వై సి పి నాయకుడే . కానీ తాను  లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మాత్రం రాజకీయ ప్రయోజనం కోసం తీయలేదని వర్మ చెప్పడం గమనార్హం . 
ఈ కార్యక్రంలో తన  స్వంత సంస్థ ఆర్ జీ వి  గన్ షాట్ ఫిలిమ్స్ ను వర్మ ప్రారంభించాడు . పోసాని కృష్ణ మురళి, పృథ్వి ఇద్దరు రామ్ గోపాల్ వర్మ గురించి , లక్ష్మీస్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి మాట్లాడారు . తప్పు చెయ్యకపోతే చంద్ర బాబు నాయుడు ఎందుకు భయపడాలి ” అని ప్రశ్నించారు . 23 ఏళ్ల తన మనోవేదనను వర్మ తెలుగు ప్రజలందరికీ తన చిత్రం ద్వారా పంచుతున్నారని అన్నారు .
 
ఇక వర్మ జర్నలిస్టులు అడిగిన పలు ప్రశాలకు సమాధానాలు సూటిగా కాకుండా తనదైన పద్దతిలో చెప్పారు . ఈ సినిమా తీయడాని ప్రధాన కారణం నందమూరి బాలకృష్ణ అని, ఆయన తనని పిలిచి మాట్లాడకపోతే ఈ సినిమా ఉండేది  కాదని చెప్పారు . ఎన్టీఆర్ బయోపిక్ లో లక్ష్మి పార్వతి పాత్ర ఉండదని తనతో చెప్పాడని, ఆమె లేకుండా అది బయోపిక్ కాదని తానూ చెప్పానని వర్మ వివరించాడు . 
బాలకృష్ణ ఆరోజు అలా అనివుండకపోతే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లేదని వర్మ చెప్పాడు . అందుకే లక్ష్మీస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున బాలకృష్ణకు ప్రత్యేకంగా  గుర్తు చేసుకుంటున్నానని వర్మ పేర్కొన్నాడు . ఈ సందర్భంగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్లను  ఆవిష్కరించాడు 

Related posts