telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టర్కీలో అమీర్‌ఖాన్… సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు

Amir

కరోనా మహమ్మారి సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రజలంతా వణికిపోతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికొస్తే… గత నాలుగున్నరేళ్లుగా సినిమా షూటింగులకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అనుకోకుండా దొరికిన ఈ బ్రేక్ లో సినీ సెలెబ్రిటీలంతా తమ ఫ్యామిలీతో కలిసి గడుపుతున్నారు. ఇటీవల ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చిన ఎవ్వరూ సాహసించడం లేదు. కొంతమంది మాత్రం దైర్యం చేసి ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తాజాగా అమీర్‌ఖాన్‌ టీం టర్కీకి వెళ్లింది. అమీర్ మాస్క్ వేసుకున్న ఆయన అభిమానులు గుర్తుపట్టేసారు. ఒక్కసారిగా అందరూ ఆయన పై ఎగబడ్డారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్క సారిగా ఫ్యాన్స్ ఎగబడటంతో చేసేదేమీ లేక అభిమానుల కోసం వారితో నవ్వుతూ సెల్ఫీలు దిగాడు అమీర్. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts