telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

చరిత్ర చూసి.. గెలుపుపై అత్యాశపడుతున్న .. పాక్ ..

pak cricket fans hopes on world cup

పాక్ క్రికెట్ అభిమానులు ఎప్పుడో జరిగిన దానిని, నేటి పరిస్థితులతో పోల్చుకొని తమదే విజయం అంటూ అత్యాశపడుతున్నారు. పాక్ చరిత్రలో 1992లో వరల్డ్ కప్ ను సాధించిందన్న సంగతి తెలిసిందే. ఆపై మరెన్నడూ కప్ ను ఆ జట్టు అందుకోలేదు. ఇప్పుడు కనిపిస్తున్న సెంటిమెంట్ నిజమైతే, పాక్ దే కప్ అని అభిమానులు అప్పుడే పండుగ చేసుకుంటున్నారు. 1992లో పాకిస్థాన్ వరల్డ్ కప్ లో ఆడిన వేళ, ఏం జరిగిందో, ఇప్పుడూ సరిగ్గా అలాగే జరుగుతుండటం వారి ఆశలకు అసలు కారణం.

అప్పటి ప్రపంచ కప్ పోటీలో తొలి మ్యాచ్ లో ఓడిన పాక్, రెండో మ్యాచ్ గెలువగా, మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆపై నాలుగు, ఐదవ మ్యాచ్ లను ఓడిపోయిన పాక్, సెమీస్ పై ఆశలను వదిలేసుకుంది. ఆపై ఆరు, ఏడవ మ్యాచ్ లలో పాకిస్థాన్ గెలిచిన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని జట్టు, అదే ఊపుతో కప్పును ఎగరేసుకు పోయింది. ఇక ప్రస్తుత మ్యాచ్ లలోనూ పాక్ పయనం సరిగ్గా 17 ఏళ్ల నాడు ఎలా జరిగిందో అలాగే జరగడం గమనార్హం. యాదృశ్చికమే అయినా, ఇప్పుడు కూడా పాక్ జట్టే విజయం సాధించి, సగర్వంగా స్వదేశానికి వస్తుందని పాక్ క్రికెట్ అభిమానుల ఆశ.. !!

Related posts