telugu navyamedia
రాజకీయ వార్తలు

ముగిసిన కుంభ‌మేళా…

క‌రోనా తీవ్ర‌త దృష్ట్యాకుంభ‌మేళాను ముగించాల్సిందిగా జునా అఖారా చీఫ్ స్వామి అవ‌దేషానంద్ గిరిని కోరారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. దీనిపై స్పందించిన ఆయ‌న‌.. అర్థాత‌రంగా కుంభ‌మేళాను ముగిస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.. క‌రోనా నేప‌థ్యంలో కొనసాగుతున్న కుంభమేళాను విరమించుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.. ప్ర‌జ‌లు, వారి మ‌నుగ‌డే.. సాధువుల‌కు ముఖ్య‌మ‌ని సోష‌ల్ మీడియాలో పేర్కొన్న ఆయ‌న‌.. కోవిడ్ తీవ్ర‌త నేప‌థ్యంలో కుంభం నుండి తీసిన దేవతలందరినీ నిమజ్జనం చేసిన‌ట్లు వెల్ల‌డించారు అవ‌దేషానంద్ గిరి. కుంభ‌మేళాలో ప‌విత్ర స్నానాల‌న్నీ ముగిశాయ‌ని, కేవ‌లం బైరాగిల స్నానాలు మిగిలి ఉన్నాయ‌న్నారు అవ‌దేషానంద్ గిరి.. షాహి స్నాన్ కోసం పెద్ద సంఖ్య‌లో రావద్ద‌ని భ‌క్తుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.. ఇక‌, కోవిడ్ 19 నేప‌థ్యంలో వృద్ధులు, పిల్ల‌లు దీనికి దూరంగా ఉండాల‌ని కోరారు.. ఏప్రిల్ 1న ప్రారంభమైన కుంభమేళాకు వేలాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు.. ఈ సమయంలో దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు రెండు ల‌క్ష‌ల‌ను దాటేసింది.. ఇక‌, కుంభ‌మేళాను కొన‌సాగిస్తే.. త‌ర‌లివ‌చ్చే భ‌క్తుల‌తో ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారిపోతాయ‌నే ఆందోళ‌న రేకెత్తిస్తోంది.. ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం.. కుంభ‌మేళా ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు కొన‌సాగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఇప్పుడు దానిని ముగిస్తున్నారు.

Related posts