తెలంగాణ శాసనసభ కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇకపై భవన నిర్మాణాలకు అనుమతులను సులభతరం చేస్తామని చెప్పారు. 75 గజాల వరకు ఉన్న స్థలంలో నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదని తెలిపారు.
76 నుంచి 600 గజాల వరకు స్థలాల్లో నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ చట్టం చాలా కఠినంగా ఉంటుందని చెప్పారు. కొత్త చట్టంపై ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలని తెలిపారు. తప్పులు చేసే ఉద్యోగులకు వెన్నులో భయం పుట్టేలా ఈ చట్టం ఉంటుందని తెలిపారు.