telugu navyamedia
తెలంగాణ వార్తలు

అత్యాచార కేసుల్లో ఏ ఒక్క నిందితుడికి బెయిల్ రాకూడదు -మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

గుజరాత్ లోని సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం, 7గురి హత్య కేసులో నిందితులను విడుదలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేధికగా స్పందించారు. అత్యాచార నిందితులను శిక్షించే చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు.

దీనికి కొంతమంది ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అత్యాచారం కేసులో ప్రభుత్వం ఏం చేసిందని.. ఆకేసులో నిందితులు బయటే ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. ఈకామెంట్లపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించే వెర్రి ట్రోలర్స్ కు తానిచ్చే సమాధానం ఇదేనంటూ.. రేపిస్టులను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపామని తెలిపారు. 45 రోజుల తర్వాత వారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు.

ఈ రేపిస్టులను చట్ట ప్రకారం శిక్షించే వరకు మేము పోరాడుతామని ట్విట్ చేశారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఐపీసీ, సీఆర్పీసీలోని లొసుగుల వల్ల రేపిస్టులు తప్పించుకుంటున్నారన్నారు.

.అందుకే ఈ చట్టాలను సవరించాలని తాను డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. అత్యాచార కేసుల్లో ఏ ఒక్క నిందితుడికి.. బెయిల్ రాకుండా ఉండాలన్నారు. చట్టాల్లో సవరణ చేసి బెయిల్ రాకుండా చేస్తే..అత్యాచార కేసుల్లో దోషిగా తేలినప్పుడు వారు మరణించే వరకు జైలులోనే ఉంచాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా దేశమంతా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొంటున్న వేళ బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో దోషులను పంద్రాగస్టు నాడే గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది.

Related posts