తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తం 3 వేల 175 పోస్టులున్నాయి. వైద్యుల పోస్టులు 980 ఉండగా..నర్సులు, పారామెడికల్, ఇతర పోస్టులు 2 వేల 195 ఉన్నాయి. PMSSY కింద ప్రతిపాదించిన పోస్టులకు త్వరలోనే సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు వైద్య శాఖ భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 5 సంవత్సరాల్లో సుమారు 11 వేల కొత్త పోస్టులను మంజూరు చేసినట్లు అంచనా.
ఇప్పటికే సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కొత్తగా నెలకొల్పిన ప్రభుత్వ కళాశాలలకు అవసరమైన పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. PMSSY కింద నిర్మిస్తున్న సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులకూ పోస్టుల మంజూరు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. వరంగల్ MGM, ఆదిలాబాద్ RIMS ఆసుపత్రుల్లో 797 కొత్త పోస్టుల మంజూరుకు రంగం సిద్ధం చేస్తోంది.